Archive | మే 2012

ఓ నాటి అమ్మను నేటి ఆట బొమ్మను

చిన్నారి  పొన్నారి  ఆశలతో  పూచిన  పూ రెమ్మను  అందరిలా 

ఆశలతో నా అత్తగారింట  అడుగుడిన  ఆడపడుచును  అందరిలా  

పిల్లలతో పాపలతో హాయిగా సుఖసంతోషాలతో  సాగిని సంసారమే  

కూతురు అల్లులు కొడుకు కోడళ్ళు మనమలు మనుమరాండ్రు లతో  వర్ధిల్లిన  జీవితం  

విధి కేమైనదో  జంటగా  ఉన్న   మమ్ము విడదీసింది   నను ఏంతో  వేధించింది  వ్యధల  పాల్జేసింది 

తుదకు కసి తీరక  నా రెక్కలు విరచి  అవిటి దాన్ని చేసింది పక్షపాతంతో  నాకు  పక్షవాతం ఇచ్చింది 

నేను  ముద్దాడిన  నా కొడుకే  నాకు అమ్మ  అమ్మనైన  నేను  ఆఖరికి  నా బిడ్డ   చేతి  బొమ్మనైపోయను 

వ్యధ  ముసరగా  ముద్దదిగదు  అచేతనంతో  ఆఖరి పిలుపుకై  ఎప్పుడా అని  ఎదురుచూస్తున్నాను 

ఓ  నాటి  అమ్మను   నేటి  ఆట  బొమ్మను 

 

దేవుడు  ఆడిన  చదరంగలో  ఆఖరికి  ఓడిన  రాణిని  – విరాగిణిని 

ప్రకటనలు

స్నేహం

స్నేహం  ఒక  తీయని  బాట

Friendship

Friendship (Photo credit: Iguanasan)పడదోయదు  ఏనాటికి


గన్నేరుల  పల్లెరుల  రానీయదు  దరి


దుఖః ముల   దాహముల  తీర్చేటి  దొరి


 నీ నీడ నీజాడ మరిచినా  నిను ఏనాడు  మరువని తోడు


నీ వారు  నిను  ఎవగించిన  నిను ఏనాడు  వీడని జోడు


ప్రతిధ్వనిలా  ఓయని  పలికే  నీ  ఆమని


ప్రతిక్షణము  నిను పరిరక్షచించే ఒక  పరిభ్రమణ  సుదర్శన  చక్రం స్నేహం  పరమ  పవిత్రం  ప్రియురాలి  వలపుల కన్న


స్నేహం  ఒక  నిశ్చల  తత్వం  చలించదు  జవరాలిలా


పరీక్షల  రాళ్ళు  వేసి  చెడగొట్టకు ఆ  నిశ్చల  అంతరంగాన్ని


చెడగొట్టకు  ఆ  నిర్మల  నిశబ్బ్ద  ఘాడ  సమాధి  స్థితిని .

నేను మీ వికృత స్వరూపాన్ని

గగనతలం నా  ఛత్రం –  దిన  పాలకులు  నా  దిక్పాలకులు 

Fire World

Fire World (Photo credit: Wikipedia)


కాలం నా ముంజేతి  కంకణం – యమపాశం  నా  చేతి  శూలం 


నిత్యాగ్నిహోత్రాలు  నా  రెండు  కళ్ళు – బుగబుగలు  బుసబుసలు  నా  దీర్గశ్వాసాలు


రుద్రులకు  రుద్రుడను  మహావీర  భద్రుడను – నేనే  ప్రళయకాల  ఘోషా  సముద్రుడను


నా ధీర్ఘ   బాహువులు  ఉప్పొంగే  ఉప్పెనలు  –  నా  దీర్ఘ  శ్వాసలు  సుడులు తిరిగే వడగాడ్పులు


నా ఉదరాగ్ని గోళాలు బడబాగ్నులు చిమ్ము –  నా  పదఘట్టలు భునభొంతరముల  కుదుపు


మీ  పాపపంకిలల  ప్రతిఫలాన్ని – మీ హ్రుదయాన్తరంగాల  చీకటి  కోణాన్ని


మిమ్ము  దహియించ  వచ్చిన  మీ  భస్మాసుర  హస్తాన్ని – నేను  మీ  వికృత  స్వరూపాన్ని

నరుల మర్యాదలు నాలుగు రోజులు వుండు

నరుల  మర్యాదలు  నాలుగు రోజులు  వుండు 

Lord Venkateswara, SVBC studio in Alipiri, Tir...

Lord Venkateswara, SVBC studio in Alipiri, Tirupati (Photo credit: Wikipedia)నారాయణ  దీవెనలు   మన     వెంట  కలకాలముండు


హారతి కర్పూర అ ర్థం  కోపాన్ని జ్వలించి  వెలుగును పంచమని


తీర్తప్రసాదలకర్థం  తీవ్రమనో దోషాలమింగి మంచిని పంచమని


దేవదేవుడే  నపుడు ఎదురేగి  వస్తాడు  కొండంత  వరముల   ఆశీస్సులు  ఇస్తాడు  


ఎదలోన  నిలుపుకొని పులకించిపో   దిన  దినము  తలుచుకుని  సేవించుకో 

మోసం

Graphic representation of the brazilian RPG se...

Graphic representation of the brazilian RPG setting Tormenta god Hyninn, the God of the Thievish and of the Cheating. Português: Representação gráfica do deus Hyninn, o Deus dos Gatunos e da Trapaça, do cenário de RPG brasileiro Tormenta. (Photo credit: Wikipedia)

మోసం  ఒక  మసక  తెరలాటిది  – తేర  చాటున  దాగిన  మోహాన్ని చూడనీయదు 


మర్యాదనే   మంచు గోడ  చాటు చేసుకొని  – మొహమాటమనే  ఐసు  నీళ్ళు  చల్లుతుంది

మాటలతో   మన  మాట  పెగల  నివ్వ దు  – చేష్టలతో    మనలను  నిస్చేష్టలను  చేస్తుంది 

స్నేహం  ప్రేమా  అనే  బంధనలతో  అటు ఇటు మెదలనివ్వదు  – మెడ  మీది  తల  గొరిగేస్తుందిఆకాశం , చంద మామ రోజు మన పెరట్లో కనిపిస్తారని

ఆకాశం , చంద మామ  రోజు  మన  పెరట్లో  కనిపిస్తారని

Moon

Moon (Photo credit: Wikipedia)


 మనకొక్కరికే  హక్కులంటే  ఫక్కున  నవ్వదా  భూలోకం


పారే నీళ్ళు  వీచే  గాలి ప్రతిరోజు  మన  గుమ్మములో కి  వస్తాయని 


 మా ఒక్కరి చుట్టలంటే  ముక్కున  వేలువేసుకోదా  ఈ    లోకం 


మనకు అందుబాటులో ఉండి  మనవి  కానివని  తెలిసి వదులుకోలేము  అనుభంధం


కన్నపేగు తెంచుకొని  పుట్టిన  మన  పిల్లల  పై  ఎలా  ఒదులు కొగలం  మమకారం


మన  కందనంతా దూరాన    వున్నారని  మన  కందకుండా  పోయారని


సర్వే  జన  సుఖినో భవంతు  అనే  మనం  మన  పిల్లలు  సుఖంగా  వుండాలని  కోరుకుంటాం .
ఆరాధనా నిలుపుకోవాలంటే ప్రేమించటం నేర్చుకోవాలి అహంకరించటం కాదు .

Adirondack Chair

Adirondack Chair (Photo credit: frontier.1968)

యెంత  పెద్ద   వారైన   దురహం కారులు  కారాదు


ఎదిగే కొద్ది  ఒదిగి  ఒదిగి  వుండాలి   బంగారంలో  పచ్చ  నద్ది నట్లు


ముద్ద   బంగరాన్ని  కూడా  మూలన  పెడతాము  మెనినా  తోడగం


ఆరాధనా నిలుపుకోవాలంటే   ప్రేమించటం   నేర్చుకోవాలి  అహంకరించటం  కాదు .