Archive | జూన్ 2012

ఆఖరికి


కరిగే కాలంలో శిలలా ఎన్నాళ్ళు  ఇలా  మిగిలిపోతావు 

Cyborg Satyr

Cyborg Satyr (Photo credit: Mechanekton)


కసి ద్వేషం దుర్మార్గం స్వార్థం  చేతుల్లో  ఎన్నాళ్ళు  ఇలా  నలిగిపోతావు 


నిన్ను నమ్ముకున్నవారిని ఇలా ఎన్నాళ్ళు  కుళ్ళబెడతావు


నీవు  సాధించింది  ఏమిటి  నిశ్శబ్ద  స్మశాన  సామ్రాజ్యం 


ఎలటానికి  సమాధులు  తప్ప  ఎమ్ముంది  ఇప్పుడు 


ఇప్పుడైనా  మారు  లేదా 


ఆ సమాధులలో  నీవు ఒక సమాధి అవుతావు  


ఆఖరికి 

blessed couple

                                                                                                                                                 ప్రాణానికి  ప్రాణం  అయిన  ప్రాణ నాధుడు పోయే 


పతివియోగ  దు :ఖం  దూరం కాదు సతి  కంట  కన్నినీరు  నిలిచి పోదు 


రెక్కలు  తెగిన  పక్షిలా  పక్షవాతం  కమ్మి  విగతజీవి లా విలపించే 


భవ భందనములు  తెంప  ఆ రాఘవేంద్రుడే  ఒసగే   కడకు  మోక్షము 

కీర్తి శేషులు శ్రీ k . వెంకోబరావు మరియు శ్రీమతి అనసూయమ్మ

కీర్తి  శేషులు  శ్రీ  k . వెంకోబరావు  మరియు  శ్రీమతి  అనసూయమ్మ 

జంట  బాయని  జంట ; జంటగా ఎగిరిపోయే భువినుంచి దివికి   

ప్రకృతి

తొలకరి వానలతో  

 

వనాలు , గిరులు , ఝరులు 

 

పులకరించి  పోతున్నాయి 

 

తడిఆరిన  గొంతులు 

 

మెలమెల్లగా  లేస్తున్నాయి 

 

కుహు  కుహు  రాగాలతో 

 

కొండలు కోనలు  మారుమ్రోగి  పోతున్నాయి 

 

నింగి  ఘాడ పరిష్వంగంలో 

 

నేలతల్లి  పరవశించి  పోతున్నది 

 

ప్రకృతి కాంత లా  పరుగులు  తీస్తున్నది 

అన్యాయ – జడ్జి


ఆఖరికి  జడ్జి కూడా  జైలు పాలు 


పట్టాభికి  గాలి సోకింది 


లంచం దెయ్యం పట్టింది 


అంతటి  అవినీతి న్యాయమూర్తి   


చివరికి  అన్యాయ మూర్తి గా నిలిచాడు 

మనసు


పరి పరి విధముల పరిగెత్తేనే  


ఊసులు పోకా  ఊపిరాడక 


ఊయల మంచపు డోలికలాగే 


డో లనమాయే  నా మనసు 


ఆందోళనమాయే  నా మనసు 

మృత్యువు



మృత్యువు  కౌగిలి  కోరేవారు  ఏ  కోరికల కై  పరుగులు  తీయరు 


అసహాయ  జీవుల  అంతరంగ తరంగం లో  ఆఖరి అంకం  అదే 


కాలయముని  కరుణా  కటాక్ష కొరకు  ఊపిరి  ఉగ్గ  బట్టి  బ్రతుకు  బండి లాగుతుంటారు 


ఆఖరి ఘడియల  ఆవిష్కారానికి  ఆశకావేశాలతో  రగిలి పొగిలి పోతువుంటారు 


జుగుప్స  గగ్గుర్పాటు  ఏవగింపు  ఏడ్పు  కలగలసి  జీవిత చరమాంకం  అంచుల  అటునిటు  ఊగి  పోతారు 


నిస్సహాయులై  నిసృహుల  నిట్టురుపుల  నిప్పులలోన  మగ్గి  మగ్గి  మసి  బారి పోతారు 


ఏ స్పర్స  స్వాంతన  నివ్వదు  ఏ  మందు  పని  చేయదు  యమ కర స్పర్స తప్ప