Archive | జూలై 2012

చచ్చేదాకా చపలత్వం పోదు .

 

CHARLES ROBERT DARWIN

CHARLES ROBERT DARWIN (Photo credit: AlphaBetaUnlimited)

 

కోరికలు నాగుపాములై  బుసలు కొడుతుంటే 

 

శిఖరాగ్రాన  నుంచున్నా  సహాయం  కొరకు 

 

అర్థించే  చేతులకు  ఆలంబనగా  మేఘమాల  వారధి  పరిచే 

 

అయినా  చపలత్వం  చావలేదు 

 

కోరికలలో  మునిగి  లొంగి పొవాలో  

 

ఆ అమృత  హస్తాల  నందుకొని  ఆవలి  తీరం  చేరాలో 

 

చపలత్వం  చావదు 

 

చచ్చేదాకా  చపలత్వం  పోదు .

ప్రకటనలు

సిగ్గు చేటు కాదా …………

 

పాండవులు  పడరాని పాట్ల  పడ్డా  ధైర్యం  కోల్పోలేదు 

 

పాంచాలి  పరుల పంచన  దాస్యం  చేసినా ఖిన్నత పొందలేదు 

 

అరివీర  భయంకరుడు  బృహన్నలైన  దుఖించలేదు  

 

కొండలనే పిండి చేసే  భీముడు  వంటవాడైన  వగచలేదు  

 

వారికన్నా  గొప్పవా  మన కష్టాలు  ………………..

 

ఈ  మాత్రనికేనా  పిరికి పందలై  వుసురులు  తీసుకుంటున్నాము 

 

సిగ్గు చేటు  కాదా ………… 

 

సాక్షిగా

 

 

స్వేచ్చా విహంగం పరుచుకున్న రెక్కలపై 

 

వినువీధుల  విహరించని  ప్రేమ  దేవతను 

 

నిండు గర్భిణి అయిన  నీలి మేఘ ఛాయలలో 

 

పాడిపంటల  పురుడు  పొసుకొనీ  పుడమి తల్లి 

 

కారుణ్య నేత్రాల  ప్రకృతి  తల్లి  ఒడిలో 

 

కలసి  సాగుదాం  చేతులు  కలిపి ఈ ప్రపంచం  సాక్షిగా 

రేపటి వెలుగులు

ఆకాశం  చాల నిర్మలంగా వుంది 

When seen from altitude, as here from an airpl...

When seen from altitude, as here from an airplane, the sky’s color varies from pale to dark at elevations approaching the zenith. Original. I love God. (Photo credit: Wikipedia)

 

 

మౌనంగా  బయలుదేరటం  మంచిది 

 

ఎంతగా  ఏడిచినా 

 

మొలకలేతవ్వు  పూడ్చిన  విత్తనాలు 

 

సమాధుల  నిదురించే  కళ్ళు 

 

కన్నీరు  కార్చలేవు 

 

జీవితపు  నీలి నీడలు 

 

పరుచుకున్నాయి  అదృష్టం  పై 

 

సూర్యోదయ  ఆశా  కిరణాలూ 

 

నిన్నటి  చీకటిని  నిర్జిస్తాయి 

 

రేపటి  వెలుగులు  పంచుతాయి .

చూడు మరీ నా తఢ కా అన్నట్టు ఉంది

తిరువెంకట  నాధుని  ప్రసాదం  కూడా  కల్తినా 

 

మరీ  చోద్యం  కాక పోతే  ఏమిటిది  మరలు , మత్తు , ఉప్పునా ……

 

మానవ  నీచ  ప్రవృత్తి కి  ప్రత్యక్ష  నిదర్శనం  నిర్లక్ష్యానికి  పరాకాష్ట 

 

రేపు  విషం  చిమ్మరని  గ్యారంటి  ఏమిటో 

 

విషపురుగు లకన్నా  నీచమైన  రాజకీయాలతో 

 

తిరుపతి  లడ్డులో  మరలు , మత్తు , ఉప్పు  

 

కలిపి  చూడు మరీ  నా తఢ కా  అన్నట్టు  ఉంది 

ఆత్మ కథ

Adirondack Chair

Adirondack Chair (Photo credit: frontier.1968)

ఆత్మ కథ  అంటే  ఆత్మస్తుతి  కాదు 


పరనిందా సుత్తి  అంతకంటే  కాదు 


మానిన  గాయాలను  రేపటం  అంతకంటే  కానే  కాదు 


ప్రజాజీవనం  గడిపేవారు  ప్రాజ్ఞులై  వ్యవహరించాలి