Archive | ఆగస్ట్ 2012

చివరి వరకు…..

 

నీవు  నడచి  వచ్చిన  దారి 


క్రమేణా  కనుమరుగు  అవుతూ  ఉంది 


దారి  చూపిన  మైలు  రాళ్లు  ఒక్కోకటి  మాయమౌతున్నాయి 


తిరుగు  లేని  ఈ  ప్రయాణంలో  మౌనంగా  సాగిపోవటమే  చివరి  వరకు…..

ప్రకటనలు

ఆరాధన

మేఘ మంగళ  జర్ఝారి  ఘోష తరంగాలలో 

ముకుళిత వందన హస్త్తుడఆయే వాన దేవుడు 
 
భీషన  సుడిగాలుల  వీచేటి వాయు దేవుడు 
 
సుమగందముల మరిచికల  వీచే  మనోహరముగా 
 
అనాధ నాద సర్వజ్ఞా  సర్వజనులు 
 
నీ ముందు మోకరిల్లిరి 
 
కరునాతరంగా కమలాలయా 
 
కాన్చవయా  మా కరువుతీర 
 
నీ ఆరాధనా కోరి 
 
నీ ఆరాధనకు  వచ్చాము 
 
ఆదరించవయ్య  మమ్ముల 
 
శ్రీ సద్గురు  రాఘవేంద్ర 

వెలుగు తెచ్చే ధైర్యం

 

 

పశ్చిమాద్రి లో  పర్వతాల  అనుంచు నుంచి 

 

జాలువారుతోంది  వెలుగు రేఖ నెమ్మది నెమ్మదిగా 

 

ఆవురావురు మంటూ  పెను చీకటి  ఒడలు విరుచుకుంది 

 

వెలుగు రేఖలను  అమాంతం  తనలో   కలుపుకుంది 

 

నిశ్చేటలైన  జీవరాసులు  గుంపులు గుంపులు  గూటికి  చేరుకున్నాయి .

 

బిక్కు బిక్కు మని  దాకున్నాయి 

 

ఉషోదయం లో  మళ్ళి  వచ్చిన  సూర్యుణ్ణి  చూసి  కిల కిలా  రావాలతో 

 

కలకలములు   శ్రుష్టించాయి .

 

వెలుగు  తెచ్చే  ధైర్యం 

 

చీకటి  పెంచిన  భయాన్ని  తొలగించింది .

సెలవు నేస్తం

నెలల పాపగా వచ్చావు 


నేలరేడువై  వెలిగావు 


పప్పీ గా స్థానం పదిలపరుచుకున్నావు 


పన్నేడుల్లు  మాలో  ఒకరిగా  జీవించావు 


తుది శ్వాశ  నా చేతులలోనే  వదిలావు 


వీడుకోలు  వేడుక కూడా  నా చేతుల్లోనే  తీర్చుకున్నావు 


నా రాక  కొరకు  ప్రాణాలు వుగ్గబట్టినావు  సెలవు  నేస్తం 


సెలవు  నేస్తం 

అందుకే నీవు దేవుడవు

ఇరు సంధ్యలలో  బంగారు పూలతో  పూజించు 

 
నిను  సూర్యభగవానుడు  స్వయముగా తానే 
 
15 దినములకోకమారు  వెండి వెన్నెలల ధూళి తో 
 
నిను సేవించి  తరించును  ఆ రే రాజు ఎలప్పుడు 
 
10 మాసముల కొకమారు  వర్ష రుతువులో 
 
నిను  అభిషేకించు  ఆ వరునదేవుడే  స్వయముగా 
 
అను నిత్యం  పూల  పరిమళాలు వేదజేల్లి 
 
నీ  సేవలో  తరించి పులకిన్చిపోవు  పూల కొమ్మ 
 
అయితే  నేను  ఏనాడు  
 
నిను  దర్శించి  ఎరుగను , తలచి  ఎరుగను 
 
అయినా  నా పై  అపరా కరుణ కురిపించినావు 
 
అందుకే  నీవు  దేవుడవు 

అందుకేనేమో మనిషికి ఈ చపలత్వం

కాంతి కిరణాలు  చక్కగా  నిలువుగా  వుంటాయి 

 
నీటి  బిందువులు  వృతాకారం గా  వుంటాయి 
 
ఆలోచనేలే  వంకర టింకరగా  వుంటాయి 
 
అందుకేనేమో  మనిషికి   ఈ  చపలత్వం 

మృత్యు ఘడియలు సమీపించు వేళ

అన్న పానీయములు  రుచించవు 

 

ఆర్భాటము  ఆవేదనా  తప్ప 

 

మృత్యు  ఘడియలు  సమీపించు  వేళ