Archive | మే 2013

అందని అందం

సముద్రమంత 

అగాధ హృదయం 

యెవరికి అర్థం కాని అద్దం 

 

వెన్నెలంత 

వెలుగులు పంచె ప్రేమ 

ఎంతవారైనా  పాదాక్రాంతులే 

 

తీక్ష్ణ వీక్షణాలు 

ఎదుటివారు సర్ప ద్రష్టులే 

 

స్రీ ఏ భావనలకు, భాషలకు అందని అందం  

 

ప్రకటనలు

ముసి ముసి నవ్వులు

మబ్బుల చాటున 

చందమామ తొంగి చూస్తున్నాడు 

వెన్నెల పరదాల చాటున 

అందాలభామ ఓర చూపుల కవ్విస్తున్నది 

 కాలమెంత వెచ్చనైనది  

వెన్నలా వెన్నెలంతా కరిగి ఆవిరై పోయింది 

 అద్దాల చాటున చట్టుక్కున దాచుకున్న ముసి ముసి నవ్వులై మెరిసే 

నా అక్షరాలు

గగన వీధులలో యెగిరే 

తెల్లని పావురాలే నా అక్షరాలు 

 

మనో వీధులలో విహరించే 

అందమైన ఉహలే వాటి విశాలమైన రెక్కలు 

 

కనులముందు కదిలే 

వాస్తవ దృశ్యాలే వాటిని నడిపే ఇంధనాలు 

 

స్వేచ్చ, స్వాతంత్రాలే వాటి నిజమైన ఊపిరి, ఉనికి

 

నా అక్షరాలు ……………… 

మనో సంకెళ్ళను తెంచే ఉరుముల మెరుపుల పిడుగుల రాళ్లు 

 

కన్నీరు

 

కన్నీళ్ళ వెచ్చదనం 

 

తుడిచే చేతులకు తెలియదు 

 

మనసు బాధలు కన్నీరు తుడుస్తే పోవు 

 

రామ రక్షక కవచం

అవునులే 

నీకు కూడా అలుసులే 

ఏమి చేసితి రామా , నాపై కినుక 

కోరి నా ఇంట కొలువు దీరావు 

కొంగు బంగారమై  వేలిసినావు 

నేనేమి చేసితినయ్యా , నాపై కినుక 

ఏమరుపాటున యెంగిలి చేయి తగిలెనా 

శబరీ యెంగిలే మింగినోడవు , అది కాదులే 

ఆచారం మరచి నిన్ను యెదకు హత్తుకున్నానా 

గుహునే అంట కాగిన నీకు ,ఇది పెద్ద తప్పు కాదులే 

అన్ని పాపాల దశశిరస్సునే కాచావు , అంతకన్నా పెద్ద పాపమా 

విధి కోరలలో తోసి వినోదం చూస్తూ ఉన్నావు , ఏమి చేసితినయ్య రామా 

యేమరక ఏదైనా పాపం చేసివుంటే , తప్పులెంచక రామ రక్షక కవచంతో కాపాడవయ్య 

 

   

గొప్పఅనుభూతి

అందమైన ఊహల ఆవలి తీరాన 

వాలి పోయే సూరీడు యెద విచ్చుక 

పరిచాడు  బంగారు తీవాచిని  నీ కోసం 

 

ఉదయించే మల్లెల మత్తుల వెన్నల రాణి 

దిగివచ్చే తన వెండి వెన్నెలదారి నుండి  నీ కోసం 

 

ఒక గొప్పఅనుభూతిలో ఇరువురు ఒకటే  వేరు వేరు లేదు 

స్వార్థాన్ని తుంచు … ప్రేమను పంచు

ఉగ్రవాదం ఉల్కాపాతంలా 

ఓ పక్క విరుచుక పడుతున్నది 

 

అవినీతి సునామిలా 

మరో పక్క  చుట్టుముడుతున్నది 

 

జనాభా విస్పోటనం 

ఇంకొక పక్క అగ్ని పర్వతంలా పేలిపోతున్నది 

 

అన్నిదేశాలు అంతరంగిక సమస్యల సుడిగుండాలే  

అన్నిటికి ఒకటే మార్గం ………………………… 

 

స్వార్థాన్ని తుంచు ………….. ప్రేమను పంచు