Archive | జూన్ 2013

పుట్టుకకు అర్థం వెతుకుతూ

నాకన్నా

Tintoretto - La Resurrezione

ముందు వచ్చినవారు

నాతో పాటు  వచ్చినవారు

నాతోకలసి నడచినవారు

కారు చీకట్లో  కలసిపోయారు

పుట్టుకకు అర్థం వెతుకుతూ

వైరాగ్యం వదలి

మొక్కవోని ధైర్యంతో

నేనోక్కడినే  నిక్కి నీలిగి

నిబిడాంద కారాన్ని చీల్చుకుంటూ

తారాజువ్వలా దూసుక పోతున్నాను

ఆవలి అంచు  అంతు చూసే తీరాలని

ప్రకటనలు

అభాసుపాలు అవుతాయి

 

A penny for your thoughts...Dollars for your t...

నీ ఆలోచనలు 

నీ అంతరంగానికి ప్రతిబింబాలు 

అలంకరించి చూపితే అలరిస్తాయి 

అద్దంలో చంద్రబింబంలా  ఎంతో   అందంగా 

తొందరపాటుతో దోర్లిస్తే అభాసుపాలు అవుతాయి 

నలిగినపువ్వు

యెర్ర బడ్డ

~ Dead Flowers

~ Dead Flowers (Photo credit: Demipoulpe)

చెమ్మగిల్లిన కళ్ళు చెపుతాయి

ఎంత దుఃఖము యెదలో దాగుందో 

ఒణుకుతున్న 

పగిలిన పంటి క్రింది పెదవి అంచు చెపుతుంది 

ఎంత బాధ గుండెల్లో సుడులు రేపిందో 

ఎగసి పడే శ్వాసకు తెలుసు 

హృదయం ఎంతగా బరువెక్కిందో 

శిరస్సు మొత్తం ఒడిలో దాచుకుని 

కుమిలి కుమిలి పోయే ఆమెకు తెలుసు ఆమె ఏమి పోగొట్టుకుందో 

 

స్వేచ్ఛా వాయువులు

తూర్పున

Topographical map of Admiralty Island in Papua...

బంగారు రేకులు విచ్చుకున్నాయి

కరకు చీకటి

తెరలను పొరలు పొరలుగా చీల్చుకొని

అణగారిన ఆశలు

మొగ్గలు వీడి పువ్వుల్లా పరిమళిస్తున్నాయి

నిర్దయ మంచు కప్పిన  దుప్పటి తన్ని మెల్ల మెల్లగా

స్వాతంత్ర కోరికలు

రెక్కలు చాచుకొని పక్షుల్లా ఎగిశాయి నింగికి

నిదుర మత్తుల నిభిడ అంధకార ఉచల  విదిలించుకొని

స్వేచ్ఛా వాయువులు

కొంగొత్త సొబగులతో కోయిలలా కుహు కుహు రాగాలు తీసింది

( అంకితం మనస ఐలాండ్ ప్రజలకు  )

మోక్షం ప్రసాదించవయ్య కేదారేశ్వర

ఓ మహాదేవ …………..

Statue of Lord Shiva at Nageshwar

“త్రయం బకం యజా మహే

సుఘన్ధిమ్ పుష్టి  వర్దనం

ఉర్వరిక మివ బంధనాత్

మృత్యోర్ మృతీయ మామృతాత్”

నీ సాక్షిగా జరిగిన మారణహోమం

ఏ భూతలను శాంతి పరచటానికి

యముడు నిన్ను మోసపుచ్చాడు

గంగమ్మ రూపంలో వచ్చి 100 మంది  ప్రాణాలను  హరించాడు

కనీసం వారి ఆత్మకు  మోక్షం  ప్రసాదించవయ్య  కేదారేశ్వర – మహేశ్వరా

కలవవు కలసి నడిచినా

నేను ఆకాశాన్ని 

Pair of train rails in a wooded area.

నీవు  భూదేవివి

దిగంతాల ఆవల మన కలియిక

చూపరులకు, కవులకు ఇంపైన మాటలు

నీ చుట్టూ ఉంటాను – కాని నిన్ను అంటను

రైలు పట్టాల జీవితాలు ఎప్పటికి కలవవు కలసి నడిచినా  

నీలి సముద్రంలోకి

తన బలమైన 

English: Truganini (ship). Taken from a painti...

అలల బాహువులలో 

నా   జీవన నౌకను 

ఊయలలు ఉపినాడు 

ఆ దయార్థ సాగరుని ఒడిలో 

నా   జీవన నౌక పిల్లాడిలా సేద తీరింది 

ఇంతకన్నా నా కేమి కావాలి మహానిష్క్రమణ కు నీలి సముద్రంలోకి 

( వృద్ధుల కోరిక )