విరహవేదన

విరహాన్ని గూర్చి

Maharaja Fateh Singh Museum, , , .

ఆ చందమామ ను అడగకకు

ఎప్పుడు పక్కన ఉండే చుక్కలు పగలబడి నవ్వుతాయి

నీల్గుతూ పోయే

ఆ సూర్యుడుని అడగడకకు

ఎవరైనా వింటే నవ్వి పోగలరు

ఉభయ సంధ్యలతో సయ్యాట లాడుతూ ఉంటాడు

ఆ పరుగులెత్తే నది ని

అస్సలు పలకరించకు

పాపం కడలి ఒడిలో కలిసి పోవాలని ఉరకలేస్తుంది

ఈ కొండలు కోనలు

మనకు నిజం చెప్పావు

ఆ రాతి గుండెలు కోయని మన పలుకు మనకే చెపుతాయి

ఆ గుర్తొచ్చింది

అదిగో ఆ రాధమ్మను అడుగు

అల్లదిగో ఆ గోపికను అడుగు

కృష్ణుడు బృందావనం విడిచి వెళ్ళిన నాటినుంచి

విరహ వేదనతో వేగి వేసారి పోతున్నారు ఆనాటి నుంచి

భగవంతుని కొరకు సాగే వేదన అస్సలైన విరహవేదన

మిగతావన్నీ కోరిక తీర్చుకొనే కామా వాంఛలే

వ్యాఖ్యానించండి